నేను ఎవరిని? అంటే Who Am I?

Wednesday, June 17, 2009



నేను ఒక Nobody ని. నేనవరో నాకే తెలియదు. ఇక మీకేమి చెప్పేది?

మొన్నే ఎలక్షన్లు అయ్యాయి. నేనెవరికీ ఓటు వేయలేదు. ఎందుకంటే నాకు ఓటరు కార్డు లేదు. ఎందుకంటే నేనెవరినో ఎవరికీ తెలియదు. ప్చ్. పాపం అనిపిస్తున్నదా? అయ్యో. మరి ఏమ్ చేద్దాం?


సరే మీకో విషయం చెప్పనా? నా గురించి నాకు తెలియదు కాబట్టే నేను నా బ్లాగు url ని i-nenu అని పెట్టా. ఎన్త హాయో చూడండి. చక్కగా ఆరక్షరాలు. అంతే. సుఖం కదూ. అందరూ అన్నేసి అక్షరాలు కొడతారు. మరి నాది ఎన్చక్కగా చిన్నది కదా. అందుకే ఏమీ తెలియని వాళ్ళతో హాయి వ్యవహారాలు నడపటం.

గీతలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడో తెలుసా?

अनान्याश्चिन्तान्तोमा येजना: पर्युपासते |
तेषाम नित्याभियुक्तानाम योगक्षेमं वहाम्यहम||

నీకేమీ తెలియదని మరి భగవద్గీత శ్లోకం చెప్తున్నావేమిటి అంటారా? మరి నాకు ఏమీ తెలియదు కాబట్టే ఆయన చెప్పిన దానిని కాపీ కొట్టింది। లేకపొతే సొంతగానే చెప్పేవాడిని కదా। హహహ।

వేరొకరిని గాక నన్నే చిన్తించే వారి బాధ్యత అంతా నాదే అని ఆయన ఢంకా బజాయించి మరీ చెప్పాడు। ఇక నాకు భయం ఎందుకు?

అద్సరే కానీ నాకు దేవుడంటే నమ్మకం లేదు। ఎందుకంటే నాకు నేనే తెలియదు। ఇక దేవుడేమి తెలుస్తాడు। నాకు తెలియనిదేదీ నాకు లేనట్టే। అదే బెటరండీ। లేకపోతే ఉన్నప్పటినుంచీ వాటి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది।

ఐనా ఎలాగోలా బతికే నాకు దేవునితోపనేంటి? జీవుడుంటే చాలు కానీ।

ఇకప్పుడప్పుడూ కలుద్దాం।

సెలవ్।

Nobody

Read more...

About This Blog

Lorem Ipsum

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP